బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ జరుగుతోంది. తొలి రోజు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌరర్లు రాణించినప్పటికీ.. కంగారూ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్కాంబ్ (72) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. ఆసీస్ స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఆసీస్ బ్యాటర్ కమిన్స్ (33) ఫర్వాలేనిపించాడు. ఇక టీమ్ఇండియా బౌలర్ల విషయానికొస్తే.. మహమ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అశ్విన్, జడేజా 3 వికెట్ల చొప్పున తీశారు.
Ind vs Aus : ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పూర్తి.. 263 ఆలౌట్! - ashwin records
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. 263 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. టీమ్ఇండియా బౌలర్లు మహమ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అశ్విన్, జడేజా 3 వికెట్ల చొప్పున తీశారు.

టీమ్ఇండియా 'స్పిన్ ద్వయం' రికార్డులు..
ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డులు సృష్టించారు. దీంతో పాటు టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా కూడా అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో వందో టెస్టు మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్.. టీ బ్రేక్ టైంకు 3 వికెట్లు తీసి.. ఆసీస్‌పై 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. దీంతో పాటు కంగారూ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను రెండు సార్లు డకౌట్ చేసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జడెడా కూడా ఓ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టాడు.
ఇవీ చదవండి :పుజారా@ వందో టెస్ట్.. సచిన్, ద్రవిడ్, కోహ్లీ సరసన చేరనున్న 'నయావాల్'!