ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 77/1తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమ్ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 321 పరగులు చేసింది. ఆస్ట్రేలియా కన్నా 144 పరుగుల అధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 207 బంతుల్లో 120 పరుగులతో చెలరేగిపోయాడు. బంతితో కంగారూలను కంగారు పట్టించిన జడ్డూ.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. క్రీజులో పాతుకుపోయి 170 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఆసీస్ యువ బౌలర్ టాడ్ ముర్ఫీ అద్భుత ప్రదర్శన చేసి.. 5 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
IND VS AUS : చెలరేగిన రోహిత్, జడేజా.. రెండో రోజు ఆట పూర్తి.. - ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యేసరికి టీమ్ఇండియా 144 పరుగుల అధిక్యంలో నిలిచింది.
border gavaskar trophy 2023 india vs australia
మొదటి రోజు ఆటలో ఆసీస్ 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. జడేజా 5 వికెట్లతో చెలరేగి ఆడాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా జట్టులో మార్నస్ లబుషేన్ 123 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) ఫర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు.
ఇవీ చదవండి :'టీమ్ఇండియా RRR' అంటూ.. వాళ్లపై సచిన్ పొగడ్తల వర్షం..
Last Updated : Feb 10, 2023, 5:13 PM IST