తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs AUS: నాల్గో టెస్టు తొలి రోజు ఆట పూర్తి.. సెంచరీతో చెలరేగిన ఖవాజా - ఇండియా VS ఆస్ట్రేలియా

IND vs AUS : బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట పూర్తైంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్​లో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

ind vs aus forth test first day innings
ind vs aus forth test first day innings

By

Published : Mar 9, 2023, 5:04 PM IST

Updated : Mar 9, 2023, 5:38 PM IST

IND vs AUS : బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తైయ్యే సమయానికి ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్​ ఖవాజా(104*) సెంచరీతో చెలరేగి పోయాడు. కామెరూన్​ గ్రీన్​(49*) పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్​ ట్రావిస్​ హెడ్ ​(32), స్టీవెన్​ స్మిత్​(38) ఫర్వాలేదనిపించారు. కాగా, లబుషేన్​ అనూహ్యంగా కేవలం(3) పరుగులకే పెవీలియన్​ చేరాడు. పీటర్​ హ్యాండ్​కాంబ్​(17) కూడా అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఇక భారత బౌలర్లు మహ్మద్​ షమీ(2) పడగొట్టాడు. ఉమేశ్​ యాదవ్, జజేజా చెరో వికెట్​ తీశారు. ప్రస్తుతం ఖవాజా, కామెరూన్​ గ్రీన్​ క్రీజులో కొనసాగుతున్నారు.

మ్యాచ్​ను స్లో గా స్టార్ట్​ చేసిన ఓపెనర్​ ట్రావిస్​ హెడ్​.. 44 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం టీమ్ఇండియా స్టార్​ స్పిన్నర్​ అశ్విన్​ చేతిలో ఔట్​ అయ్యాడు. ఇక, ఖవాజాతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడనుకున్న లబుషేన్​ అనూహ్యంగా 3 పరుగులకే పెవీలియన్​ చేరాడు. మహ్వద్​ షమీ బౌలింగ్​లో క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి కంగారూలు రెండు వికెట్ల నష్టానికి 29 ఓవర్లలో 75 పరుగులు చేశారు. సెకండ్ సెషన్‌లో ఆసీస్‌ బ్యాటర్లు నెమ్మదిగా ఆడి టీమ్ఇండియా బౌలర్లను పరీక్షించారు. దీంతో ఆసీస్​ వికెట్ కోల్పోకుండానే ఆ సెషన్‌ ముగిసింది. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా 74 పరుగులు చేసింది.

ఆ తర్వాత వచ్చిన స్టీవెన్​ స్మిత్​ కొంత నిలకడగా ఆడి.. ఖవాజాతో స్కోరును ముందుకు కదిలించాడు. టీ బ్రేక్​ తర్వాత 135 బంతుల్లో 38 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్​ను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. దీంతో ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి మూడో వికెట్‌కు నెలకొల్పిన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టీవ్‌ స్మిత్ పవీలియన్​ చేరిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (17*).. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి.. షమీ వేసిన 71వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్​ గ్రీన్‌ దూకుడుగా ఆడాడు. ఖవాజా మాత్రం వికెట్​ కోల్పోకుండా నెమ్మదిగా ఆడాడు. ఇక, ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 82వ ఓవర్‌, షమీ వేసిన 85 ఓవర్‌లో గ్రీన్‌ రెండేసి ఫోర్లు బాదాడు. మహ్మద్​ షమీ వేసిన మొదటి రోజు ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి బౌండరీ బాది.. ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్​ హజరయ్యారు. మ్యాచ్​ ప్రారంభమయ్యే ముందు ఓ ప్రత్యేక వాహనం ఎక్కి స్టేడియంలో తిరిగారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లకు క్యాప్​లు అందచేశారు. భారత్​కు, ఆస్ట్రేలియా మధ్య ఉన్న 75 సంవత్సరాల స్నేహానికి గుర్తుగా.. ఇరు ప్రధానులను బీసీసీఐ అధ్యక్షుడు​ రోజర్​ బిన్నీ సన్మానించారు.

Last Updated : Mar 9, 2023, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details