Bombblast In Stadium: అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆత్మాహుతి పేలుడు జరిగింది. వెంటనే ఆటగాళ్లందరనీ సురక్షితంగా బంకర్‌లోకి తరలించారు అధికారులు. పేలుడు తర్వాత గందరగోళం ఏర్పడడం వల్ల భయాందోళనలకు గురైన వీక్షకులంతా పరుగులు తీశారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్, పామిర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగినప్పుడు ఐరాస ప్రతినిధులు స్టేడియంలోనే ఉన్నారు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఏటా ష్పగీజా టీ20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్లో జాతీయ జట్టు, విదేశీ ఆటగాళ్లు, 'A' జట్టు ఆటగాళ్లు, అండర్ 19 జట్టులోని ఆటగాళ్లతో పాటు సంబంధిత ప్రాంతాల నుంచి ఎలైట్ ప్రదర్శనకారులు కూడా పాల్గొంటారు. అయితే ప్రతి జట్టుకు డ్రాఫ్ట్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.