అదేపనిగా బయోబబుల్‌లో(Biobubble) ఉండటం వల్ల తన మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెప్పాడు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్(Russell). ఇటీవల పీఎస్ఎల్ ఆడేందుకు దుబాయ్ చేరుకున్న అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"కేవలం నా గురించే మాట్లాడుతున్నాను. బయోబబుల్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ బుడగ వల్ల నచ్చిన ప్రదేశానికి వెళ్లలేకపోతున్నాను. బయట నడిచేందుకు కూడా అవకాశం లేదు. అయినా ఇవ్వన్నీ తట్టుకోవడానికి కారణం.. ఈ బబుల్‌లో నాకు ఇష్టమైన క్రికెట్ ఆడటమే. దీన్ని నేను గొప్పగా భావిస్తూ.. నా విధులను నిర్వర్తిస్తున్నాను"