Joe Root IPL 2023: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ 2023 ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్న అతడు కెరీర్‌లో తొలి ఐపీఎల్ సీజన్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఐపీఎల్‌లోకి వచ్చే ప్రయత్నం చేసినా.. ఫ్రాంచైజీలు అతడ్ని తీసుకోలేదు. 2018 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడే ప్రయత్నం జో రూట్ కూడా చేయలేదు. అయితే ఈ సారి ఐపీఎల్ 2023 మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. కొత్తగా రెండు జట్లు వచ్చిన నేపథ్యంలో ఏదో జట్టు కనీస ధరకు అయినా అతడ్ని తీసుకునే అవకాశం ఉంది.
IPL 2023 ఎంట్రీ వెనుక జో రూట్ మాస్టర్ ప్లాన్.. ఇంగ్లాండ్ బాబు మాములోడు కాదు! - ఐపీఎల్ 2023 వార్తలు
ఐపీఎల్ సీజన్ 2023లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్. నాలుగేళ్ల క్రితం ఐపీఎల్‌లోకి వచ్చే ప్రయత్నం చేసినా.. ఫ్రాంచైజీలు అతడ్ని తీసుకోలేదు. అయితే ఎన్నడూ లేనిది ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు జో రూట్ ఆసక్తికనబర్చడం వెనుక మాస్టర్ ప్లానే ఉందని తెలుస్తోంది. అదేంటంటే?
అయితే ఎన్నడూ లేనిది ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు జో రూట్ ఆసక్తికనబర్చడం వెనుక మాస్టర్ ప్లానే ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ టోర్నీ కోసమే జో రూట్ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 ఆడితే భారత్ పిచ్‌లు, మైదానాలపై ఓ అవగాహన వస్తుందనేది జో రూట్ ప్లాన్ అంట. భారత బౌలర్లతో పాటు ప్రపంచ టాప్ బౌలర్లను కూడా ఐపీఎల్‌లో ఎదుర్కొనే అవకాశం ఉండటంతో రూట్ ఐపీఎల్‌ను సరైన వేదికగా భావిస్తున్నాడు.
అందుకే కనీస ధరక అమ్ముడు పోయినా సరే ఐపీఎల్ 2023 ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జోరూట్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. తనకు ఎంత తక్కువ ధర వచ్చినా పర్వాలేదని, అసలు ధరతో తనకు సంబంధంలేదని, ఐపీఎల్ ఆడితే చాలని చెప్పాడు. అయితే మినీ వేలంలో రూట్ అమ్ముడుపోతాడా? అనేదే అసలు సమస్య. టెస్టు స్పెషలిస్ట్ అయిన జో రూట్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాదని కొందరు అభిమానులు అంటుండగా.. మరి కొందరు మాత్రం పది ఫ్రాంచైజీలున్నాయి కాబట్టి అవకాశం దక్కవచ్చంటున్నారు. ఆ ధైర్యంతోనే జో రూట్ వేలానికి వస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది.