తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మ్యాచ్​లో రెండు సార్లు టాస్​ - బిగ్​ బాష్​ లీగ్​లో అంతే గురూ! - బిగ్ బాష్​ లీగ్ 2023 మ్యాచెస్

Big Bash League Toss : క్రికెట్​లో ఏదో ఒక అనూహ్యమైన ఘటన జరుగుతుంటుంది. అది కొన్ని సార్లు కాంట్రవర్సీలకు దారి తీస్తే, మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తుంటాయి. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్​ లీగ్​లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరిని నవ్విస్తోంది. అదేంటంటే ?

Big Bash League Toss
Big Bash League Toss

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 9:47 AM IST

Big Bash League Toss :క్రికెట్​ ప్రపంచంలో ఏదో ఒక వింత ఘటన జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు అవి పెద్ద కాంటవర్సీలకు దారి తీస్తే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. ఆసీస్ వేదికగా మంగళవారం జరిగిన బిగ్ బాష్ లీగ్​లో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్​ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడి వారు షాకయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు.

అక్కడ బ్యాటే టాస్​
బీబీఎల్‌లో సాధారణంగా టాస్‌ను కాయిన్​తో కాకుండా బ్యాట్‌తో వేస్తారు. ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే రూల్​ కొనసాగుతోంది. బ్యాటు బోర్లా పడటం, పడకపోవడం లాంటి గుర్తులను పరిగణనలోకి తీసుకుని టాస్​ నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్‌‌తోనే టాస్ వేశారు. టాస్‌ వేసేందుకు సిడ్నీ థండర్ కెప్టెన్ క్రిస్ గ్రీన్, బ్రిస్బేన్ హీట్ కెప్టెన్ కోలిన్ మున్రో ముందుకొచ్చారు. ఇక బ్యాట్​ను గాల్లోకి విసిరి రిజల్డ్​ కోసం ఎదురుచూశారు. కానీ బ్యాట్ ఎటూ పడకుండా సరిగ్గా మధ్యలో నిలబడింది. దీంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక మరోసారి టాస్​ వేసేందుకు ప్రయత్నించారు. అలా రెండోసారి బ్యాట్​ను​ విసరగా అది ఓ వైపుకు పడింది. దీంతో సిడ్నీ థండర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్​ లవర్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమందేమో ఈ వీడియోను చూసి నవ్వుకుంటూ ఇతరులకు షేర్ చేస్తుండగా, మరికొందరు మాత్రం నిర్వాహకుల తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టాస్​ను బ్యాట్​తో వేయకుండా కాయిన్​తో వేయ్యొచ్చు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

పిచ్​ బాలేదని మ్యాచ్​ రద్దు
మరోవైపు ఇదే లీగ్​లో మరో అనూహ్యమైన ఘటన జరిగింది. ఇటీవలే జరిగిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్​ను పిచ్ కారణంగా రద్దు చేశారు. 6.5 ఓవర్ల పాటు సాగిన మ్యాచ్​ను ఆ తర్వాత అంపైర్లు రద్దు చేశారు. పిచ్ ప్రమాదకరంగా ఉందని, భిన్నంగా స్పందిస్తూ బాల్స్ బౌన్స్ అవుతున్నాయంటూ మ్యాచ్​ను నిలిపివేసి ఇరు జట్లకు పాయింట్లను సమానంగా పంచారు.

బంగ్లా ప్లేయర్ వెరైటీ ఔట్ - బ్యాడ్​లక్​ అంటే అతడిదే!

కీపర్ ప్యాడ్​లో చిక్కుకున్న బంతి- డేంజర్​గా మారిన పిచ్- క్రికెట్​లో విచిత్ర సంఘటనలు

ABOUT THE AUTHOR

...view details