తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Rankings: మెరుగైన భూవీ, చాహల్, చాహర్  స్థానాలు - ఐసీసీ ర్యాంకింగ్స్ న్యూస్

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్(ICC Rankings)​లో టీమ్ఇండియా బౌలర్​ భువనేశ్వర్​ కుమార్ 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. చాహల్, దీపక్​ చాహర్​లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.

bhuvi, bhuvaneshwar image
భువనేశ్వర్ కుమార్

By

Published : Jul 28, 2021, 4:00 PM IST

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్(ICC rankings)​లో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ స్థానం సంపాదించాడు. వాషింగ్టన్​ సుందర్​ను వెనక్కు నెట్టి 16వ స్థానం దక్కించుకున్నాడు. సుందర్​కన్నా 3 పాయింట్లు ఎక్కువగా సంపాందించి మొత్తం 588 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20లో ఉత్తమ ప్రదర్శన కనబరచడం భువీకి కలిసొచ్చింది.

భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్​ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. చాహల్​ 21 స్థానం దక్కించుకోగా, దీపక్ 34వ స్థానంలో ఉన్నాడు.

నెంబర్ 2..

శ్రీలంక ఆల్​రౌండర్ వనిందు హసరంగ టీ20 బౌలర్లలో రెండో స్థానం దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్​ను వెనక్కి నెట్టాడు. వనిందు ఖాతాలో 720 పాయింట్లు ఉండగా.. రషీద్​ ఖాన్​ 719 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రియజ్ షంసీ 792 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి:ICC Rankings: మెరుగైన ధావన్​, చాహల్ స్థానాలు

ABOUT THE AUTHOR

...view details