Best Young Cricketers 2023: 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నీలు సహా, పలు సిరీస్‌లు జరిగాయి. ఈ క్రమంలో ఆయా దేశాల నుంచి ప్రతిభావంతులైన పలువురు యువ క్రికెటర్లు ప్రపంచానికి పరియచం అయ్యారు. వారెవరో తెలుసుకుందాం.
యశస్వి జైశ్వాల్: 22 ఏళ్ల యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్‌కు 2023 ఏడాది కలిసొచ్చింది. జైశ్వాల్ ఏడాదిలోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడిన జైశ్వాల్, తొలి ఇన్నింగ్స్‌లోనే 171 భారీ సెంచరీ సాధించాడు. తర్వాత ఆగస్టులో టీ20లో అరంగేట్రం చేసే ఛాన్స్ పట్టేశాడు. 14టీ20లు ఆడిన ఈ యంగ్ బ్యాటర్ 430 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం.
రచిన్ రవీంద్ర: న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఈ రెండేళ్లలో రచిన్‌కు పెద్దగా కలిసిరాలేదు. కానీ, ఆ ఏడాది జరిగిన 2023 వరల్డ్‌కప్‌లో మాత్రం రచిన్ అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఏకంగా 64.22 స్టైక్ రేట్లతో 578 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. తాజాగా 2024 ఐపీఎల్ వేలంలో కూడా రచిన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
టౌహిద్ హ్రిదోయ్:బంగ్లాదేశ్‌కు చెందిన 23 ఏళ్ల టౌహిద్ హ్రిదోయ్ ఈ ఏడాది వన్డే కెరీర్ ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లోనే 92 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 2023 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై 74 పరుగులతో రాణించాడు హ్రిదోయ్. కెరీర్లో ఇప్పటివరకు 27 వన్డే మ్యాచ్‌లు ఆడిన హ్రిదోయ్ 727 పరుగులు నమోదు చేశాడు.