వరల్డ్ కప్‌ను చేతిలోకి తీసుకుని ముద్దాడాలని ప్రతి క్రికెటర్ ఆశిస్తాడు. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తాడు. మైదానంలో చెమటలు చిందిస్తాడు. కానీ, జట్టుగా సమష్టి కృషి చేసినప్పుడు విజయం వరిస్తుంది. ప్రపంచకప్ దక్కుతుంది. అయితే.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగించినప్పటికీ ఏ మెగా టోర్నీలోనూ ట్రోఫీని దక్కించుకోలేకపోయారు కొందరు క్రికెటర్లు. యూఏఈ వేదికగా త్వరలోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రపంచకప్ కల.. కలగానే మిగిలిపోయిన పలువురు క్రికెట్ దిగ్గజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సౌరవ్ గంగూలీ..
1999 నుంచి 2007 వరకు మూడు ప్రపంచకప్‌లు ఆడిన సౌరవ్ గంగూలీ(Ganguly in World Cup) వరల్డ్‌కప్ కల మాత్రం తీర్చుకోలేకపోయాడు. 2003లో తన సారథ్యంలో ఫైనల్ వరకు చేరగలిగినా.. నిరాశే మిగిలింది. ఈ టోర్నీలో గంగూలీ మూడు శతకాలతో ఆకట్టుకున్నాడు. 2007లో భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2011లో టీమ్ఇండియా ప్రపంచకప్ సాధించినప్పటికీ గంగూలీ(Ganguly Retirement) అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ టోర్నీల్లో 22 మ్యాచ్‌లాడిన గంగూలీ 55.88 సగటుతో 1006 పరుగులు చేశాడు.
కుమార సంగక్కర..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కుమార సంగక్కర(Sangakkara in 2015 World Cup). నాలుగు ప్రపంచకప్‌లు ఆడిన సంగక్కరకు(Sangakkara Centuries) వరల్డ్‌కప్ ఆశ తీరలేదు. 2007, 2011 టోర్నీల్లో శ్రీలంక ఫైనల్ వరకు చేరినా.. ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయాడు. చివరగా 2019 ప్రపంచకప్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది శ్రీలంక. ఈ మ్యాచ్ తర్వాత సంగక్కర రిటైర్మెంట్ ప్రకటించాడు. శ్రీలంక 1996 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోగా.. అప్పటికి సంగక్కర అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేయలేదు.
బ్రియన్ లారా..
టెస్టు క్రికెట్ చరిత్రలో తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన బ్రియన్ లారా(Brian Lara Centuries) ఆ స్థాయిలో కాకపోయిన వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. 299 వన్డేలాడిన ఈ విండీస్ దిగ్గజం 10వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఆరంభం నుంచి బౌలర్లపై విరుచుకుపడి ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించే లారా ప్రపంచకప్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. 1975, 1978 ప్రపంచకప్ విజేతగా నిలిచిన విండీస్ ఆ తర్వాత టైటిల్‌ను అందుకోలేదు.
జాక్వస్ కలిస్..
ప్రపంచ క్రికెట్లో ఉన్న నాణ్యమైన ఆల్రౌండర్లలో జాక్వస్ కలిస్(Jacques Kallis Centuries) ఒకడు. సనత్ జయసూర్య తర్వాత టెస్టు, వన్డే రెండు ఫార్మాట్ల్లో పదివేల పరుగులతో పాటు 250కు పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కలిస్(Jacques Kallis World Cup Stats) రికార్డు సృష్టించాడు. 17 శతకాలు, 86 అర్ధ శతకాలు చేసిన కలిస్‌కు ప్రపంచకప్ కల తీరలేదు. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేకపోయింది.