తెలంగాణ

telangana

ETV Bharat / sports

Kohli De Villiers: డివిలియర్స్​ రిటైర్మెంట్​పై కోహ్లీ భావోద్వేగం - దక్షిణాఫ్రికా

2018లోనే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ (AB De Villiers Retirement) ప్రకటించినా.. ఐపీఎల్​లో ఆడుతూ అభిమానులకు వినోదాన్ని పంచుతూ ఉన్నాడు ఏబీ డివిలియర్స్​. అయితే అనూహ్యంగా శుక్రవారం అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి షాక్​కు గురిచేశాడు. ఏబీతో ఎంతో సన్నిహితంగా (Kohli De Villiers) ఉండే టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ.. ఈ నిర్ణయం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని చెప్పాడు. ఏబీపై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేనని, అతడికి తానెప్పుడూ నెం.1 ఫ్యాన్​గా ఉంటానని భావోద్వేగానికి గురయ్యాడు.

virat kohli ab de villiers
విరాట్​ కోహ్లీ

By

Published : Nov 19, 2021, 5:44 PM IST

క్రికెట్​లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు (AB De Villiers Retirement) దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్​ ప్రకటన పట్ల భావోద్వేగానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). ఈ నిర్ణయం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని అన్నాడు.

2011 ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ తరఫున ఆడుతున్నప్పటి నుంచి వీరి బంధం (AB De Villiers and Virat Kohli) కొనసాగుతోంది.

కోహ్లీ, ఏబీ

"నేను కలిసిన అత్యుత్తమ ఆటగాడు, స్ఫూర్తి రగిలించే వ్యక్తి.. ఏబీ. నువ్వు సాధించినదానికి ఎంతో గర్వపడాలి. ఆర్​సీబీకి నువ్వు చేసింది చిరస్మరణీయం. మన బంధం.. ఆటకు మించినది. ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. నీ నిర్ణయం నన్ను ఎంతో బాధిస్తున్నా.. నీకు, నీ కుటుంబానికి మంచి చేసేదే అని భావిస్తున్నా. ఐ లవ్​ యూ ఏబీ."

-విరాట్ కోహ్లీ, ఆర్​సీబీ మాజీ కెప్టెన్

అనంతరం ఇన్​స్టాగ్రామ్​లోనూ ఏబీపై ఉన్న తన ప్రేమను వ్యక్తపరిచాడు కోహ్లీ. "ఆర్​సీబీ (RCB News) కోసం ప్రాణం పెట్టావు. నీపై ఈ ఫ్రాంఛైజీకి, నాకు ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేను. చిన్నస్వామి స్టేడియం నిన్ను మిస్​ అవుతుంది. నీతో కలిసి ఆడటాన్ని నేను మిస్​ అవుతాను బ్రదర్. ఐ లవ్​ యూ. నేను ఎప్పటికీ నీకు నెంబర్​.1 ఫ్యాన్​." అని రాసుకొచ్చాడు ఆర్​సీబీ మాజీ కెప్టెన్.

కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ కూడా ఏబీ నిర్ణయం పట్ల భావోద్వేగానికి లోనైంది. అతడి కుటుంబానికి మంచి జరగాలని ఆశిస్తూ.. ఇన్​స్టాలో పోస్ట్​ పెట్టింది. హార్ట్​ బ్రేకింగ్​ అంటూ వ్యాఖ్యానించింది.

అనుష్క పోస్ట్​

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ మాజీలు, ప్రస్తుత తరం క్రికెటర్లు ఏబీకి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. అతడిని ఆల్​ టైమ్​ గ్రేట్​గా అభివర్ణించారు.

క్రికెట్​కు మీరు ఎంతో ఇచ్చారు. ఆటలో మీరు లెజెండ్. అద్భుతమైన అథ్లెట్. మీకు అంతా మంచే జరగాలి.

-శిఖర్ ధావన్, టీమ్​ఇండియా క్రికెటర్

అద్భుతమైన కెరీర్​ పట్ల అభినందనలు. ఆధునిక క్రికెట్​ దిగ్గజాలలో మీరూ ఒకరు. ఎందరికో స్ఫూర్తి. సెకండ్​ ఇన్నింగ్స్​కు ఆల్​ ది బెస్ట్.

-వీవీఎస్ లక్ష్మణ్, ఎన్​సీఏ డైరెక్టర్

రికార్డు భాగస్వామ్యం..

ఐపీఎల్​లో ఆర్​సీబీ తరఫున (AB De Villiers RCB) ఎన్నో మరపురాని భాగస్వామ్యాలను నెలకొల్పారు కోహ్లీ-డివిలియర్స్. రెండు సార్లు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు వీరి పేరిట ఉంది. 2016లో గుజరాత్ లయన్స్​పై 229 పరుగుల భాగస్వామ్యం, 2017లో ముంబయి ఇండియన్స్​పై 215 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది ఈ జోడీ.

ఐపీఎల్ (IPL News)​ చరిత్రలో ఇప్పటి వరకు 10 సార్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీ వీరిది మాత్రమే. మొత్తంగా 3000 పరుగుల భాగస్వామ్యం కూడా రికార్డే. డేవిడ్ వార్నర్​ తర్వాత ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసింది ఏబీనే (5162 పరుగులు).

డివిలియర్స్​

ఆర్​సీబీ షేర్​..

ఆర్​సీబీ తరఫున 156 మ్యాచ్​లు ఆడిన ఏబీ.. 4491 పరుగులు చేశాడు. జట్టులో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసింది (AB De Villiers Record) అతడే. ఆర్​సీబీ చరిత్రలో రెండో (133), మూడో (129) అత్యధిక వ్యక్తిగత స్కోర్లు అతడివే.

అభిమానుల ఆవేదన..

డివిలియర్స్​ను ఇక మైదానంలో చూడలేమంటూ అభిమానులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. మిస్టర్​ 360 ఆటను మిస్​ అవుతామని, అతడో లెజెండ్​ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇవీ చూడండి:

అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్ గుడ్​ బై.. ఆర్సీబీ ఫ్యాన్స్​కు నిరాశ

దిగ్గజాలే కానీ ప్రపంచకప్​ అందుకోలేకపోయారు!

'ఇక అంపైర్లు సంతోషంగా నిద్రపోతారు'.. కోహ్లీపై డివిలియర్స్​ ఫన్నీ ట్రోల్!

ABOUT THE AUTHOR

...view details