తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీతో ఆడితేనే ఆ విషయం అర్థమవుతుంది: స్టోక్స్​ - బెన్​స్టోక్స్​

Benstokes kohli: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్ ప్లేయర్​ బెన్​స్టోక్స్​. విరాట్​ లాంటి ఆటగాడితో ఆడితేనే టాప్‌ లెవెల్‌ ఆటంటే ఏంటో అర్థమవుతుంది.

Benstokes kohli
కోహ్లీ బెన్​స్టోక్స్​

By

Published : Jul 19, 2022, 10:27 PM IST

Benstokes kohli: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడని ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. సోమవారం అతడు వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు పోస్టు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ నేపథ్యంలోనే దానికి స్పందించిన కోహ్లీ.. 'నేను ఆడిన ప్రత్యర్థుల్లో అత్యంత పోటీ ఇచ్చిన క్రికెటర్‌ నువ్వే' అంటూ కామెంట్‌ చేశాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం దక్షిణాఫ్రికాతో ఆడే తన చివరి వన్డేకు ముందు స్టోక్స్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్‌ విషయానికి స్పందించిన విరాట్‌ను అతడు మెచ్చుకున్నాడు.

"ఫార్మాట్లకు అతీతంగా కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడు. అతడితో ఆడిన ప్రతిసారీ ఆస్వాదించాను. ఆటపట్ల అతడు చూపించే శ్రద్ధ, అంకితభావం నన్నెప్పుడూ ఆకట్టుకుంటాయి. కోహ్లీ లాంటి ఆటగాడితో ఆడితేనే టాప్‌ లెవెల్‌ ఆటంటే ఏంటో అర్థమవుతుంది. నా రిటైర్మెంట్‌ పోస్టుపై అతడు స్పందించడం ముచ్చటేసింది" అని స్టోక్స్‌ ప్రశంసలు కురిపించాడు. అయితే, ఈ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌ ఆడేటప్పుడే ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తొలి వన్డే తర్వాత తాను జట్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాననే భావన కలిగిందని, దాంతో పాటు ఇతరుల అవకాశాలను కూడా తాను లాగేసుకుంటున్నట్లు అనిపించిందని స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: సూపర్​ బౌలింగ్​.. 1993 రిపీట్​.. అచ్చం షేన్​వార్న్​లానే

ABOUT THE AUTHOR

...view details