Ranzi trophy Bengal players record: రంజీ ట్రోఫీలో భాగంగా ఝార్ఖండ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. చరిత్రలో నిలిచిపోయే ఆట ఆడింది. మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు (బుధవారం) నాటికి 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
బెంగాల్ అదుర్స్.. తొలి 9 మంది 50 ప్లస్.. 129 ఏళ్ల రికార్డు బద్దలు - bengal nine players half century
Ranzi trophy Bengal players record: రంజీ ట్రోఫీలో.. చరిత్రలో నిలిచిపోయే రికార్డు నమోదైంది. సూమరు 129 ఏళ్ల రికార్డును బెంగాల్ జట్టు ఆటగాళ్లు బద్దలు కొట్టారు. అదేంటంటే..
ఓపెనర్‌తో మొదలు తొమ్మిదో ఆటగాడి వరకు ప్రతిఒక్కరూ అర్ధసెంచరీ చేయడం విశేషం. గతంలో 1893లో సుమారు 129 ఏళ్ల కిందట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీపై 8 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్ధశతకాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. బెంగాల్ బ్యాటర్లలో సుదీప్(186), అనుస్తుప్ మజుందార్(117) సెంచరీలతో అదరగొట్టగా.. అభిషేక్ రమన్(61), అభిమన్యు ఈశ్వరన్(65), మనోజ్ తివారి (73), అభిషేక్ పోరెల్(68), షాబాజ్ అహ్మద్(78), సయన్(53*), ఆకాశ్ దీప్(53*) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఝార్ఖండ్ మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసి 634 పరుగుల వెనుకంజలో నిలిచింది.
ఇదీ చూడండి: దటీజ్ మిథాలీ రాజ్.. అతివల క్రికెట్‌ను అందలమెక్కించి