Stokes Ashes: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ఔటవకుండా బతికిపోయాడు. ఇది చూసిన ఆసీస్ క్రికెటర్లతోపాటు అంపైర్లు, ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే!
స్టంప్స్‌కు బంతి ముద్దిచ్చింది.. స్టోక్స్ బతికిపోయాడు!
Stokes Ashes: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్టులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇంగ్లీష్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే!
ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెరూన్ గ్రీన్ 30వ ఓవర్ వేశాడు. ఇతడి బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఓ బంతిని ఆడకుండా వదిలేశాడు. అయితే అది ఎల్బీడబ్ల్యూగా భావించిన అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. తర్వాత స్టోక్స్ రివ్యూ కోరగా.. అసలు విషయం అర్థమైంది. అసలు ఆ బంతి తాకింది ప్యాడ్స్‌కు కాదు.. నేరుగా ఆఫ్ స్టంప్‌ను తాకింది. కానీ అదృష్టవశాత్తు బెయిల్స్ కిందపడలేదు. దీంతో స్టోక్స్ నాటౌట్‌గా బతికిపోయాడు. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కాగా చివరికి 66 పరుగులు చేసిన స్టోక్స్.. లియోన్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. బెయిర్ స్టో (103) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో వుడ్ (39) మెరుపులు మెరిపించడం వల్ల మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది ఇంగ్లాండ్. మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు డిక్లేర్ చేసిన ఆసీస్.. ఇంకా 158 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.