Ben Stokes on Joe Root captaincy: కెప్టెన్‌గా వ్యవహరించాలన్న ఆశ తనకు అస్సలు లేదని అన్నాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. జో రూట్ సారథ్యంలో తాను ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. రూట్, కోచ్ సిల్వర్‌వుడ్.. ఆటలో తనను ఎంతగానో ప్రోత్సాహించారని పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్‌లో యాషెస్ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో.. ఓటమికి జో రూట్, కోచ్ సిల్వర్‌వుడ్ బాధ్యత వహించాలి, రూట్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. బెన్‌స్టోక్స్‌ను సారథిగా నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన స్టోక్స్.. కెప్టెన్సీపై తనకు అస్సలు ఆశ లేదని చెప్పాడు.