తెలంగాణ

telangana

ETV Bharat / sports

మీడియాకు బెన్​ స్టోక్స్‌ స్ట్రాంగ్​ కౌంటర్.. అదిరిపోయిందిగా! - Bairstow Runout Controversy

Ben Stokes Latest Tweet : ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు కూడా ముగిసి రెండు రోజులైంది. కానీ బెయిర్‌స్టో స్టంప్​ ఔట్​​ ఔట్‌ వివాదం మాత్రం ఇంకా నెట్టింట హల్​ చల్​ చేస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్​ కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ను ఆస్ట్రేలియన్​ వార్త పత్రిక వ్యంగ్యంగా చిత్రీకరించగా.. దానికి స్టోక్స్​ తనదైన స్టైల్​లో రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..

ben stokes twitter
ben stokes reply

By

Published : Jul 4, 2023, 1:24 PM IST

Ben Stokes Reply : ప్రతిష్టాత్మకయాషెస్‌ సిరీస్​లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. అయితే, చివరి రోజు ఆట సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు కాస్త వివాదాస్పదంగా కావడం వల్ల ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య కూడా ఘాటైన సంభాషణ జరిగింది. అంతే కాకుండా ఈ విషయం మీడియాలోనూ మాటల యుద్ధానికి దారితీసింది. తొలుత ఆసీస్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇంగ్లాండ్‌ మీడియా విమర్శలు గుప్పించగా... తాజాగా ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ను ఉద్దేశించి 'ఏడుస్తున్న చిన్నపిల్లాడు' అన్న హెడ్డింగ్‌తో ఆస్ట్రేలియా న్యూస్‌పేపర్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇక దీనిపై స్పందించిన బెన్ స్టోక్స్‌.. ఆ పత్రికకు తనదైన స్టైల్​లో కౌంటర్‌ ఇచ్చాడు.

Ben Stokes Vs Aus Media :నోటిలో పాలపీక, యాషెస్‌ టైటిల్‌, టెస్టుల్లో వాడే ఎర్ర బంతిని ఉంచినట్టు బెన్‌ స్టోక్స్‌ ఫొటో ఎడిట్​ చేసి సదరు పేపర్‌ ప్రచురించింది. అదే క్లిప్పింగ్‌ను ట్విట్టర్​ వేదికగా షేర్‌ చేసిన బెన్‌ స్టోక్స్‌.. "నా గురించి అయి ఉండదని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను కొత్త బంతితో ఎప్పుడు బౌలింగ్‌ చేశాను?" అంటూ స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ అభిమానులు 'సూపర్‌ కౌంటర్‌ ఇచ్చావు. నువ్వు నిజంగా అద్భుతమైన ఛాంపియన్‌' అంటూ స్టోక్స్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరికొంత మంది ఆయన మద్దతు తెలుపుతూ ట్వీట్స్​ కూడా చేస్తున్నారు.

Eng Vs Aus Ashes 2023 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ 155 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు తీవ్రంగా పోరాడాడు. కానీ మరోవైపు నుంచి మద్దతు లేకపోవడం వల్ల 327 పరుగులకే పరిమితమై 43 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ జట్టు.. 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Bairstow Runout Controversy : మ్యాచ్‌ ముగిసిన తర్వాత బెయిర్‌ స్టో ఔట్‌పై బెన్‌ స్టోక్స్‌ స్పందించిన తీరుతోనే ఇంగ్లాండ్ కెప్టెన్‌కు వ్యతిరేకంగా ఆసీస్‌ మీడియా కథనాలను రాసుకొచ్చింది. "బెయిర్‌స్టో ఔట్‌ను వివాదం చేయదలుచుకోవడం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం అది ఔట్‌గానే ప్రకటించారు. ఓవర్ పూర్తయిందని అన్నారా అని నేను అంపైర్లను అడిగాను. వారు అలా అనలేదని నాకు చెప్పారు. విజయం కోసం వచ్చిన అవకాశాన్ని ఆసీస్‌ వాడుకుంది. అయితే ఈ పద్దతిలో మీరు గెలవాలనుకుంటారా? అని నన్ను అడిగితే మాత్రం.. దానికి లేదు అనే సమాధానం చెబుతాను. క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించడం వల్ల వచ్చే విజయం మాకు అవసరం లేదు. నేను అయితే అప్పీల్‌ను వెనక్కి తీసుకొనేవాడిని" అని బెన్ స్టోక్స్ వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details