తెలంగాణ

telangana

ETV Bharat / sports

100 సిక్సర్లు.. 100 వికెట్లు.. తొలి టెస్టు క్రికెటర్​గా రికార్డు పుస్తకాల్లోకి! - టెస్ట్​ ప్లేయర్​

టెస్టుల్లో బ్యాటింగ్​, బౌలింగ్​ రెండింట్లోనూ రాణిస్తూ గొప్ప ఆల్​రౌండర్​గా పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్​ క్రికెటర్​ బెన్ స్టోక్స్​ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటికే 100కుపైగా వికెట్లు తీసిన స్టోక్స్​.. ఇప్పుడు 100 సిక్సర్లు కూడా కొట్టి తొలి క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు.

Ben Stokes becomes first Test player to hit century of sixes and bag 100 wickets
Ben Stokes becomes first Test player to hit century of sixes and bag 100 wickets

By

Published : Jun 25, 2022, 2:54 PM IST

Ben Stokes Record: ప్రస్తుతం క్రికెట్లో ఆల్​రౌండర్​ అనే పాత్రకు న్యాయం చేసే వారు తక్కువ మందే ఉన్నారు. ఇందులో ఇంగ్లాండ్​ క్రికెటర్​, టెస్ట్​ కెప్టెన్ బెన్​ స్టోక్స్​ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్మాట్లో 100 వికెట్లకుతోడు.. 100 సిక్సర్లతో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్​గా నిలిచాడు. న్యూజిలాండ్​తో హెడింగ్లేలో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఈ రికార్డును అందుకున్నాడు స్టోక్స్​.

మూడో టెస్టు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు స్టోక్స్​. ఇందులో 2 ఫోర్లు, ఓ సిక్సర్​ ఉంది. ఇది అతడికి టెస్టు ఫార్మాట్లో 100వ సిక్స్​. మొత్తం 81 టెస్టులాడిన స్టోక్స్​ ఇప్పటికే 177 వికెట్లు కూడా తీశాడు. దీంతో టెస్టు క్రికెట్​లో 100 వికెట్లు, 100 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు.

బెన్​ స్టోక్స్​

చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ 329 పరుగులకు ఆలౌటైంది. మిచెల్​(109) టాప్​ స్కోరర్​. బ్లండెల్​ 55 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్​ స్పిన్నర్​ జాక్​ లీచ్​ 5 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం.. బ్యాటింగ్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​కు తన పేస్​తో చుక్కలు చూపించాడు లెఫ్టార్మ్​ బౌలర్​ ట్రెంట్​ బౌల్ట్​. టాప్​-3 బ్యాటర్స్​ను క్లీన్​బౌల్డ్​ చేశాడు. 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. బెయిర్​స్టో (126 బంతుల్లో 130), జేమీ ఓవర్టన్​(106 బంతుల్లో 89) వన్డే తరహాలో చెలరేగగా ఇంగ్లాండ్​ రెండో రోజు 264/6తో నిలిచింది. ఆట ఇంకా 3 రోజులు మిగిలిఉంది. తొలి రెండు మ్యాచ్​లు గెలిచిన ఇంగ్లాండ్​.. 2-0తో ఇప్పటికే సిరీస్​ దక్కించుకుంది.

ఇవీ చూడండి:ఒకే ఒక్కడు 'మిచెల్​'.. ఇంగ్లాండ్​పై 400 పరుగులు చేసి రికార్డు!

వివాదాస్పద పాక్​ 'అంపైర్​'.. ఇప్పుడు బట్టలు, చెప్పులు అమ్ముకుంటూ!

ABOUT THE AUTHOR

...view details