తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్​లో తొలి మ్యాచ్​- నా సలహాతోనే సక్సెస్​! - స్వీయ సలహా

తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా తనకు తానే సలహా ఇచ్చుకున్నానని తెలిపాడు టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ సూర్యకుమార్ యాదవ్. బ్యాటింగ్​కు వెళ్లేముందు కొంత ఆందోళన చెందినట్లు వెల్లడించాడు.

surya kumar yadav, team india batsman
సూర్యకుమార్ యాదవ్, టీమ్ఇండియా బ్యాట్స్​మన్

By

Published : May 25, 2021, 5:14 PM IST

టీమ్​ఇండియా తరఫున అరంగేట్ర మ్యాచ్ సందర్భంగా తాను స్వీయ సలహా ఇచ్చుకున్నానని వెల్లడించాడు యువ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో భారత్​కు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు సూర్య.

"మీరు సరిగ్గా గమనించి ఉంటే నా తొలి మ్యాచ్​ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ అదే సమయంలో రోహిత్ ఔట్​ కావడం వల్ల సంతోషంగా ఉండలేకపోయాను. బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వెళ్లేముందు కొంత ఆందోళన చెందాను. కానీ, నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. 'గతంలో వన్​డౌన్​లో బ్యాటింగ్ చేసినప్పుడు ఎలా ఆడావో.. ఇప్పుడూ అలానే ఆడు. అంతకుమించి వద్దు. నువ్వు నువ్వులా ఉండు.' అని స్వీయ సలహా ఇచ్చుకున్నాను."

-సూర్య కుమార్ యాదవ్, టీమ్ఇండియా బ్యాట్స్​మన్.

ఇక ఆ మ్యాచ్​లో తొలి బంతినే స్టాండ్స్​లోకి పంపడంపైనా స్పందించాడు సూర్య. "ఆర్చర్​ బౌలింగ్​లో ఐపీఎల్​లో ఆడిన అనుభవం ఉన్న కారణంగానే అలాంటి షాట్​ కొట్టగలిగాను. క్రీజులోకి వచ్చాక.. నేను ఊహించిన బంతినే వేశాడు. దీంతో తొలి బంతినే సిక్సర్​గా మలిచాను" అని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:'అప్పట్లో ద్రవిడ్​ను చూస్తే భయపడేవాళ్లం'

ABOUT THE AUTHOR

...view details