ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లందరూ మే19న ముంబయిలో సమావేశమవ్వడానికంటే ముందే.. మూడు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటిల్లో నెగెటివ్ వస్తేనే ముంబయికి వెళ్లాలి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో సుదీర్ఘ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లు.. తొలుత మూడు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో నెగెటివ్ రిపోర్టు వస్తేనే ముంబయికి చేరుకోవాలి. అక్కడ 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలి. అక్కడి నుంచి టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్కు బయల్దేరుతుంది. అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.