కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్‌ను ఎలాగైనా ఈ ఏడాది పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న బీసీసీఐ అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (జూన్ 18-22) ముగిశాక.. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు చాలా విరామం ఉండటం వల్ల.. దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ యత్నం.. ఈసీబీకి విజ్ఞప్తి! - wtc final
కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదాపడిన ఐపీఎల్‌ను ఎలాగైనా ఈ ఏడాది పూర్తి చేయాలని చూస్తోంది బీసీసీఐ. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిశాక, ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆరంభానికి చాలా సమయం ఉండటం వల్ల, దానిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ యత్నం
షెడ్యూల్ ప్రకారం తొలి టెస్టు ఆగస్టు 4న ఆరంభం కావాలి. సెప్టెంబరు 10-14 మధ్య చివరి టెస్టు జరగాలి. అయితే ఒక వారం ముందే తొలి టెస్టును ఆరంభించడం సహా.. మ్యాచ్‌ల మధ్య విరామాన్ని తగ్గించి సెప్టెంబరు అంతా ఐపీఎల్ కోసం ఖాళీగా ఉంచుకోవాలన్నది బీసీసీఐ ఆలోచన. బీసీసీఐ ఇప్పటికే ఈ అంశంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిందని ఆ జట్టు మాజీ ఆటగాడు మైక్ అథర్టన్ చెప్పాడు.
ఇది చూడండి:'డబ్ల్యూటీసీ టైటిల్ కివీస్‌దే.. భారత్‌కు కష్టమే!'