యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలోనే ఓ బడా హాస్సిటల్లో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందం పంత్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అతడికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొంది. అయితే చెప్పినట్టుగానే తాజాగా అతడి విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గాయం కారణంగా పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడకపోయినా అతడి ఏడాది వేతనం రూ.16 కోట్లు చెల్లించనుంది. అంతేకాదు రూ.5 కోట్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పంత్‌కు బోర్డు మొత్తం వేతనం చెల్లించాలని నిర్ణయించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న ఆటగాళ్లందరికీ బీమా ఉంటుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు గాయం కారణంగా టోర్నీకి దూరమైతే ఆ మొత్తాన్ని ఫ్రాంచైజీలు చెల్లించవు. బోర్డే ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. అనంతరం బీమా కంపెనీ ఆ డబ్బుని బీసీసీఐకి అందిస్తుంది.