ICC world cup 2023 Venues India : ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్‌పై బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. వరల్డ్ కప్ టోర్నీలో ఏఏ మ్యాచులు ఏఏ వేదికలపై నిర్వహించనున్నారో.. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటికే ఈ టోర్నీని 12 వేదికల్లో నిర్వహిస్తామని ప్రకటించింది బీసీసీఐ.
ICC WC 2023 Venues : వన్డే ప్రపంచ కప్ 2023 టోర్న్‌మెంట్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం సహా హైదరాబాద్, చెన్నై, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, లఖ్‌నవూ, ఇందౌర్, రాజ్‌కోట్, ముంబయి, గువాహటి మైదానాలు వేదికలు కానున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లకు కేవలం ఏడు మైదానాలే వేదిక కానున్నాయి. ఇకపోతే భద్రతా కారణాల దృష్యా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను కొన్ని వేదికలకే పరిమితం చేయనుంది బోర్డు. పాకిస్థాన్ తమ మ్యాచ్‌లను కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను కోల్‌కతా, గువాహటిలో ఆడేలా బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తోంది.
గతంలో భారత్ ఆతిథ్యం...ఇది వరకు వన్డే ప్రపంచకప్‌నకు భారత్ మూడు సార్లు ఆతిథ్యమిచ్చింది. అయితే 1987లో పాకిస్థాన్‌తో, 1996లో పాక్, శ్రీలంకలతో కలిసి సంయుక్తంగా వేదికను పంచుకుంది. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో కలసి ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చింది. ఆ సంవత్సరం మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఫైనల్లో శ్రీలంకపై ఉత్కంఠ పోరులో గెలిచి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత భారత్ ఆడిన 2015, 2019 ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లోనే నిష్క్రమించింది. 2015లో ఆస్ట్రేలియాపై ఓడగా.. 2019లో న్యూజిలాండ్‌పై పరాజయం పాలైంది.