తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముదురుతున్న టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ వ్యవహారం..

BCCI vs Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ బుధవారం బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి చర్చలు జరపకుండానే బీసీసీఐ తనను వన్డే కెప్టెన్​గా తొలగించిందని అన్నాడు. ఈ వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది.

virat kohli
విరాట్​ కోహ్లీ

By

Published : Dec 15, 2021, 7:24 PM IST

BCCI vs Virat Kohli: బుధవారం ఉదయం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బీసీసీఐ అధికారులు తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని విరాట్​ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ వ్యాఖ్యలను బీసీసీఐ కొట్టి పారేసింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పునకు సంబంధించి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని వెల్లడించింది.

'విరాట్ కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే అతడితో చర్చలు జరిపాం. మా ఆలోచనతో ఏకీభవించని కోహ్లీ.. టీ20 పగ్గాలను వదులుకునేందుకే సిద్ధపడ్డాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. జట్టులో సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ భావించింది. ఫలితంగా వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని నిర్ణయించింది. ఈ విషయంపై సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మ కోహ్లీతో ముందుగానే చర్చించాడు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, గతంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండు రోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

ఈ వివాదంపై అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షా డర్టీ పాలిటిక్స్​ చేస్తున్నారని, జట్టు ప్రయోజనాల గురించి వారు ఆలోచించడంలేదని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details