తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల ప్రీమియర్​ లీగ్​.. 'మస్కట్​' వీడియో చూశారా?

ఉమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ 2023 ప్రచారం కోసం బీసీసీఐ ఓ మస్కట్​ను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా పోస్ట్ చేశారు.

bcci mascot
bcci wpl mascot

By

Published : Mar 2, 2023, 12:38 PM IST

ఉమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ 2023 కి సర్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే జట్లతో పాటు సభ్యుల వివరాలను వెల్లడించిన బీసీసీఐ తాజాగా ప్రీమియర్​ లీగ్​ మస్కట్​ను ఆవిష్కరించింది. 'శక్తి' అనే ఓ పులి బొమ్మను మస్కట్​గా తెలుపుతూ బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ వీడియోను రిలీజ్ చేశారు. 'శక్తి రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే' అని రాసుకొచ్చారు. బ్లూ కలర్​ జెర్సీ వేసుకున్న ఆ అందాల పులి బొమ్మ క్రికెట్​ బ్యాట్​ చేతబట్టి స్టేడియంలో విజృంభించింది. డబ్ల్యూపీఎల్​కు ఈ మస్కట్​ మరింత వన్నె తెచ్చింది. కాగా క్రికెట్​ చరిత్రలో తొలిసారి మహిళల ప్రీమియర్​ లీగ్​ జరగనుంది.

ముంబయి వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు జరగనున్న ఈ తొలి సీజన్​ కప్​ కోసం ఐదు జట్లు తలపడనున్నాయి. ముంబయి ఇండియన్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు,యూపీ వారియర్స్​, గుజరాత్​ జెయింట్స్​తో పాటు దిల్లీ కెపిటెల్స్.. ఈ ఐదు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. ఇక మొదటి మ్యాచ్​లో ముంబయి- అహ్మాదాబాద్​ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్​ వేదికల కోసం ముంబయితో పాటు అహ్మదాబాద్​, దిల్లీ, బెంగళూరు, లఖ్​నవు నగరాలను ఎంపిక చేసింది బీసీసీఐ. కాగా ఈ సీజన్​ మీడియా హక్కులను బీసీసీఐరూ. 951 కోట్లకు విక్రయించింది.

అహ్మదాబాద్​ను గౌతమ్​ అదానీకి చెందిన అదానీ స్పోర్ట్స్ లైన్​ ప్రైవేట్​ లిమిటెడ్.. రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది.​ ఇక ముంబయి ఫ్రాంచైజీని ఇండియా విన్​ స్పోర్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.912 కోట్లకు దక్కించుకుంది. ఆర్సీబీ టీమ్​ను రాయల్​ ఛాలేంజర్స్​ స్పోర్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.901 కోట్లకు దక్కించుకుంది. దిల్లీ ఫ్రాంచైజీని జే ఎస్​ డబ్ల్యూ జీఎంఆర్​ క్రికెట్ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.810 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక లక్నో టీమ్​ను కాప్రి గ్లోబల్​ హోల్డింగ్స్​ ప్రైవేట్ లిమిటెడ్​ రూ.757 కోట్లకు సొంతం చేసుకుంది.

మరో వైపు ఇటీవలే ఈ సీజన్​ థీమ్​ సాంగ్​ను విడుదల చేసింది బీసీసీఐ. ఉత్తేజకరంగా ఉన్న ఈ థీమ్ సాంగ్‌ క్రికెట్​ అభిమానులు ఎంతో ఆకట్టుకుంది . 'యే తో బాస్ షురత్ హై' అంటూ సాగే ఈ పాట, క్రీడారంగంలో శిఖరాగ్రానికి చేరుకోవడానికి అనేక అడ్డంకులను అధిగమించిన భారత మహిళా క్రికెటర్ల స్థైర్యంతో పాటు దృఢ సంకల్పానికి చిహ్నంగా ఈ పాటను రూపొందించినట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details