ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021) ప్రారంభానికి మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మెగాటోర్నీకి 15 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు రిజర్వ్ క్రికెటర్లను బీసీసీఐ ఎంపిక(India Team in T20 World Cup) చేసింది. అయితే జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్ కిషన్, సూర్య కూమార్ యాదవ్, హర్దిక్ పాండ్య వంటి యువ ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శన పేలవంగా ఉండడం వల్ల వారి స్థానంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ఇటీవలే వార్తలొచ్చాయి.
టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం లభించిన తర్వాత సదరు ఆటగాళ్లలో నిర్లక్ష్యం పెరిగిందని కొందరు నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. ఇదే కారణంగా ఐపీఎల్లో(IPL 2021) పేలవ ప్రదర్శన చేసిన వారిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ కోశాధికారి(BCCI Treasurer Arun Dhumal) అరుణ్ ధుమాల్ స్పందించారు.