తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్(BCCI Apex Council meeting) సమావేశం ఈ నెల 20న జరగనుంది. ఈ మీటింగ్​లో లైంగిక వేధింపుల నిర్మూలన పాలసీ సహా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు బీసీసీఐ సభ్యులు.

BCCI
బీసీసీఐ

By

Published : Sep 7, 2021, 12:35 PM IST

బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం(BCCI Apex Council Meeting) సెప్టెంబర్​ 20న జరగనుంది. లైంగిక వేధింపుల నిర్మూలన పాలసీ, ఇప్పటికే ఆలస్యమైన దేశవాళీ క్రికెటర్లకు పరిహారం అందించే ప్యాకేజీ అంశంపై నిర్ణయం తీసుకునేందుకుగాను ఈ మీటింగ్ జరగనుంది.

చర్చకు వచ్చే అంశాలు..

లైంగిక వేధింపుల అంశానికి సంబంధించి ఇప్పటివరకు బీసీసీఐలో(BCCI News) ప్రత్యేక పాలసీ అంటూ ఏమీ లేదు. అయితే.. ఇటీవలే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సీఈఓ రాహుల్ జోహ్రీ ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయంపై చర్చించేందుకు బీసీసీఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.

గతంలో జూన్​ 20న జరిగిన సమావేశంలో.. కొవిడ్(Covid Cricket News)​ బారిన పడిన 2020-21 సీజన్ దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక సాయం అందించే అంశంపై బీసీసీఐ అధికారులు చర్చించారు. అనంతరం.. ప్యాకేజీ నిర్ణయించాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో అధికారులతో చర్చించి ఓ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయంతో మహిళా క్రికెటర్లకు కూడా చేయూత అందించనుంది బీసీసీఐ.

అలాగే అక్టోబర్​లో యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ సన్నాహాలపై ఈ మీటింగ్​లో చర్చించనున్నారు. రంజీ ట్రోఫీ నిర్వహణపైనా మంతనాలు జరపనున్నారు.

వీటితో పాటు రాష్ట్ర బోర్డుల సమస్యలపైనా వర్చువల్ వేదికగా జరిగే ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చదవండి:IndvsEng: భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన మరోసారి చూద్దాం!

ABOUT THE AUTHOR

...view details