ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచకప్ కోసం 9 వేదికలను బీసీసీఐ నిర్ణయించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల, అహ్మదాబాద్‌తో పాటు లఖ్‌నవూలలో మ్యాచ్‌లను జరపనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం.. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ మైదానంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
"2016లో భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను 7 వేదికలలో నిర్వహించింది బీసీసీఐ. ఈ సారి తొలుత ఆరు వేదికలలోనే మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించింది. కానీ, ఇతర క్రికెట్ అసోసియేషన్లు కూడా లీగ్ నిర్వహణ కోసం ఆసక్తి కనబరిచాయి. దీంతో వేదికల సంఖ్యను తొమ్మిదికి పెంచింది బోర్డు. ఇదే విషయాన్ని ఐసీసీ వద్ద ప్రస్తావించింది. దీంతో గత వేదికలైన మొహాలీ, నాగ్‌పూర్ స్థానంలో చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్నవూలను కొత్తగా ఎంపిక చేసింది" అని నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి:ధోనీ.. సీఎస్కే గుండెచప్పుడు: ఫ్లెమింగ్