IPL 2024 Mini Auction : భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్లా ప్రపంచంలో మరే లీగ్ ఫేమస్ కాలేదు. విదేశీ, స్వదేశీ ప్లేయర్లతో ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు మంచి కిక్కిస్తుంది. ఈ లీగ్ జరుగుతున్నంత కాలం క్రికెట్ ప్రియులు టీవీలను వదలరు. కొందరూ టికెట్లు బుక్ చేసుకుని నేరుగా స్టేడియంలో మ్యాచ్‌లు చూస్తారు. తమ అభిమాన జట్టు కప్ గెలవాలని కోరుకుంటారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్ మినీ వేలం-2024, వేదికలు ఇలా కొన్ని విషయాల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
India West Indies Tour : టీమ్ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ సిరీస్ అనంతరం ఆసియా కప్, అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌నకు సన్నద్ధమవుతోంది. ఈ ఏదాది అంతా టీమ్ఇండియా షెడ్యూల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలం-2024 ముందుగానే ఈ ఏడాది నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీమ్ఇండియా స్టార్ ప్లేయర్స్, అలాగే విదేశీ జట్లు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుందట. గతేడాది డిసెంబరు 23 ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది అంతకంటే ముందుగానే వేలం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.