కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకొచ్చింది. పది లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తమ వంతు సాయంగా అందజేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇదే విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా మాట్లాడారు.
"కరోనాపై పోరాటంలో వైద్య, ఆరోగ్య రంగం చేస్తోన్న కృషిని బీసీసీఐ గుర్తించింది. మనల్ని కాపాడేందుకు వైరస్‌పై వారు ముందుండి పోరాటం చేస్తున్నారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసే ప్రక్రియలో వైద్య రంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వల్ల కరోనా బాధితులు వెంటనే కోలుకునేందుకు అవకాశం ఉన్నందున వీటిని విరాళంగా ఇవ్వాలనుకున్నాం".