తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరో మూడు ఐసీసీ టోర్నీల కోసం బీసీసీఐ కసరత్తు - bcci icc news

వచ్చే ఎనిమిదేళ్లలోపు(icc events calendar) జరగాల్సిన మరో మూడు ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య హక్కులను దక్కించుకోవాలని బీసీసీఐ ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు బోర్డుకు చెందిన ఓ ప్రతినిధి. త్వరలోనే తమ ప్రణాళికను ఐసీసీ(bcci icc meeting) దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

icc
ఐసీసీ

By

Published : Oct 6, 2021, 11:17 AM IST

అక్టోబర్​ 17 నుంచి(t20 world cup 2021 schedule) యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్​ ప్రారంభంకానుంది. పరిస్థితి అనుకూలించి ఉంటే ఈ టోర్నీ భారత్​లో జరగాల్సింది. ప్రస్తుతం ఈ మెగాటోర్నీకి యూఏఈ ఆతిథ్యమిచ్చినప్పటికీ బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరగబోతుంది. ఇదిలా ఉండగానే భవిష్యత్​లో నిర్వహించబోయే మరిన్ని ఐసీసీ టోర్నీలను హోస్ట్​ చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తోంది బీసీసీఐ. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లకుగానూ(icc events calendar) మరో మూడు ఈవెంట్ల ఆతిథ్య హక్కులను పొందాలని బోర్డు భావిస్తోందని చెప్పారు.

"2023 ప్రపంచకప్​ తర్వాత మరిన్ని ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య హక్కులను పొందాలని ప్రణాళిక రచిస్తున్నాం. ఒక్కసారి మా ప్రణాళిక పూర్తిగా సిద్ధమైతే, త్వరలోనే జరగబోయే ఐసీసీ మీటింగ్​లో(bcci icc meeting) అధికారుల దృష్టికి ఈ ప్లాన్​ను తీసుకెళ్తాం. ఆ మెగాటోర్నీలు ఇక్కడే జరుగుతాయని ఆశిస్తున్నాం. వచ్చే ఎనిమిదేళ్లకుగానూ మూడు ఐసీసీ ఈవెంట్లను ఇక్కడ నిర్వహించాలనేదే మా లక్ష్యం."

-బోర్డు ప్రతినిధి.

అక్టోబర్​ 17 నుంచి నవంబరు 14వరకు టీ20 ప్రపంచకప్​కు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్​ జట్టుకు మెంటార్​గా మాజీ సారథి ధోనీని నియమించారు.

టీమ్ఇండియా స్క్వాడ్​:(t20 world cup 2021 indian team): విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ(వైస్​ కెప్టెన్​), కేఎల్ రాహుల్​, సూర్య కుమార్ యాదవ్​, రిషభ్​ పంత్​(వికెట్ కీపర్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్), హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్​ చాహర్​, రవిచంద్రన్​ అశ్విన్​, అక్షర్​ పటేల్​, వరుణ్​ చక్రవర్తి, జస్ప్రిత్​ బుమ్రా, భువనేశ్వర్​ కుమార్​, మహ్మద్​ షమీ.

స్టాండ్​బై ప్లేయర్స్​: శ్రేయస్​ అయ్యర్​, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​.

ఇదీ చూడండి: T20 World Cup: గుడ్​న్యూస్​.. స్డేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details