ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ తేదీల్ని బీసీసీఐ(bcci) అధికారికంగా ఖరారు చేయనుంది. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. శనివారం(ఇవాళ) జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది.
IPL 2021: రెండో షెడ్యూల్‌పై నేడే నిర్ణయం - Ranji trophy salaries
వర్చువల్ విధానంలో శనివారం(నేడు) జరగనున్న బీసీసీఐ (bcci) ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా మూడు విషయాల గురించి చర్చించనున్నారు. వాటిలో ఐపీఎల్(IPL 2021) మిగిలిన మ్యాచ్‌లు, టీ20 ప్రపంచకప్(T20 World cup) నిర్వహణ, రంజీ(Ranji Trophy) క్రికెటర్లకు పరిహారం అందించే విషయాలపై మట్లాడనున్నారు.
ఐపీఎల్
గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ వర్చువల్ భేటీలో ఐపీఎల్(IPL 2021) షెడ్యూల్ ఖరారు, టీ20 ప్రపంచకప్(T20 World cup) ఆతిథ్యం, రంజీ ట్రోఫీ(ranji trophy) క్రికెటర్ల పరిహారం అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
ఇదీ చూడండి కొవిడ్ రూల్స్ బ్రేక్- కేకేఆర్ ఆటగాడికి ఫైన్