తెలంగాణ

telangana

టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ఆవిష్కరించిన జై షా

By

Published : Sep 3, 2021, 8:26 AM IST

వచ్చేనెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2021) ట్రోఫీని బీసీసీఐ(BCCI) సెక్రెటరీ జై షా ఆవిష్కరించారు. భారత జట్టు వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది.

T20 World Cup 2021
టీ20 వరల్డ్‌ కప్‌ 2021

వచ్చేనెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2021) ట్రోఫీని బీసీసీఐ (BCCI) సెక్రెటరీ జై షా ఆవిష్కరించారు. జట్టు వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సెప్టెంబరు 10 తుది గడువుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఆలోపు అంటే సెప్టెంబరు 6 లేదా 7వ తేదీల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుదిజట్టును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ఆవిష్కరణ చిత్రం

చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ తుది జట్టును ఎంపిక చేయనుంది. అక్గోబరు 17న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది ఆటగాళ్లు, 8 మంది సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఈసారి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఒమన్‌ దేశాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి:కోహ్లీ సరికొత్త రికార్డు.. వేగవంతమైన బ్యాట్స్​మన్​గా ఆ ఘనత

ABOUT THE AUTHOR

...view details