ప్రపంచకప్ ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు - జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు
21:15 November 18
BCCI sacks Chetan Sharma led senior national selection committee
భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ పేసర్ చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీని తొలిగించింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా సెమీస్‌లో ఇంటిముఖం పట్టింది. అలాగే ఈ మెగాటోర్నీలో ఆటగాళ్ల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ సీనియర్ టీమ్ జాతీయ సెలక్షన్ కమిటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.
కాగా, తొలిగించిన కమిటీలో చేతన్(నార్త్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబాసిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సీనియర్ జాతీయ సెలెక్టర్లుగా ఉన్నారు. ఇక వీరి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 7 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఇంకా కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయి ఉండాలి. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 28గా బీసీసీఐ పేర్కొంది.
ఇదీ చూడండి:FIFA World Cup 2022: వామ్మో.. ఇదేం తిండి.. అవేం ధరలు.. ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్