తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా క్రికెటర్ల వేతనాల బాకీపై బీసీసీఐ క్లారిటీ!

బీసీసీఐ ఇటీవల ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల లిస్ట్​లో చోటు దక్కించుకోలేకపోయిన ఓ నలుగురు మహిళా క్రికెటర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు అందలేదని వస్తోన్న వార్తలను ఖండించారు ఓ బీసీసీఐ అధికారి. అందరికీ ఒప్పంద కాలానికి ప్రకారం చెల్లింపులు జరిగాయని వెల్లడించారు.

bcci
బీసీసీఐ క్లారిటీ

By

Published : May 26, 2021, 12:22 PM IST

మహిళా క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ఇటీవల ప్రకటించింది. అయితే కాంట్రాక్ట్​ లిస్ట్​లో పేరు దక్కించుకోలేకపోయిన వేదా కృష్ణమూర్తి, ఏక్తా బిస్త్, అనుజా పాటిల్​, డి.హేమలతకు ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించట్లేదని బోర్డుపై ఆరోపణలు వచ్చాయి.

తాజాగా దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి అవన్నీ అవాస్తమని కొట్టిపారేశారు. "అవన్నీ పుకార్లు. అవాస్తవాలు. ప్రతి క్రీడాకారుడితో ఉన్న ఒప్పందం, నిబంధనల ప్రకారం బీసీసీఐ వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒప్పంద కాలానికి చెల్లింపులు జరిగిపోయాయి" అని స్పష్టం చేశారు.

గతేడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​నకు సంబంధించి రావాల్సిన ప్రైజ్​మనీ.. త్వరలోనే భారత క్రికెటర్లకు అందుతుందని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. రన్నరప్​గా నిలిచిన హర్మన్​ప్రీత్ కౌర్​ సేనకు రావాల్సిన రూ.3.64 కోట్లు త్వరలోనే అందుతాయని పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సదరు అధికారి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బోర్డు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ను మరింత పటిష్ఠంగా పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.​

ఇదీ చూడండి మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ

ABOUT THE AUTHOR

...view details