IPL 2022 venue prizemoney: ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిచిన ఈ జట్టుతో పాటు అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు నగదు బహుమతి దక్కింది. పిచ్‌లు అటు బ్యాట్, ఇటు బాల్‌కు అనుకూలించడం వల్ల మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి.
బీసీసీఐ పెద్ద మనసు.. క్యురేటర్స్, గ్రౌండ్స్‌మెన్‌కు ప్రైజ్‌మనీ - ఐపీఎల్ 2022 ప్రైజ్‌మనీ కుర్యేటర్స్
IPL 2022 venue prizemoney: ఐపీఎల్ 2022 మ్యాచ్ వేదికలకు చెందిన క్యురేటర్స్, గ్రౌండ్స్‌మెన్‌కు బీసీసీఐ రూ.1.25కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. వాళ్ల హార్డ్ వర్క్ వల్లే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా జరిగాయని బోర్డు కార్యదర్శి జై షా అభినందించారు.

అయితే తాజాగా బీసీసీఐ.. మ్యాచ్‌లు నిర్వహించిన ఆరు వేదికల్లోని క్యురేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.25కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఎక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్.. పుణెలోని ఎంసీఏ స్డేడియాలకు ఒక్కోదానికి రూ.25 లక్షలు ఇచ్చింది. ప్లేఆఫ్స్ జరిగిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియాలకు ఒక్కోదానికి 12.5 లక్షలను ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు. కాగా, అద్భుతమైన మ్యాచ్‌లను అందించిన గ్రౌండ్ సిబ్బందికి ప్రైజ్‌మనీ ప్రకటించడం సంతోషంగా ఉందని, ఈ క్యురేటర్లు, గ్రౌండ్స్‌మెన్ తెర వెనుక హీరోలని ట్విటర్‌లో జై షా పేర్కొన్నారు. వాళ్ల హార్డ్ వర్క్ వల్లే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ రేపాయని చెప్పారు.