ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్.. భారత్లోనే (IPL 2022) జరుగుతుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. కరోనా కారణంగా టోర్నీ(IPL 2021) రెండో దశ యూఏఈలో జరిగింది. వచ్చే ఐపీఎల్ మాత్రం అఖండ ప్రేక్షకుల మధ్య మనదేశంలోనే నిర్వహిస్తామని దాదా (Sourav Ganguly Latest News) ఆశాభావం వ్యక్తం చేశాడు.
"దుబాయ్లో అదిరిపోయే వాతావరణం ఉంది. అయితే భారత్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టేడియం నిండిపోయి.. అభిమానులు ఉర్రుతలూగిపోతారు. అశేష ప్రేక్షకుల మధ్య భారత్లోనే వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తామని అశిస్తున్నా. వచ్చే 8 నెలల్లో కరోనా పరిస్థితి కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది."