Harmanpreet Kaur Video Bangladesh : బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెపై అంతర్జాతీయ క్రికెట్ మండలి- ఐసీసీ వేటు వేసింది. రెండు మ్యాచ్‌ల నుంచి హర్మన్‌ను బ్యాన్ చేసి కఠిన చర్యలు తీసుకుంది. దీని కారణంగా ఆసియా గేమ్స్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల్లో హర్మన్ ఆడకపోవచ్చు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆమెతో మాట్లాడతారని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపినట్లు సమాచారం.
Harmanpreet Kaur Behaviour : 'రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే హర్మన్ ప్రీత్‌తో మాట్లాడతారు. మూడో వన్డే సందర్భంగా అలా ఎందుకు ప్రవర్తించారనే దానిపై వివరణ తీసుకుంటారు. ఐసీసీ ఆమెను నిషేధించింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ఇప్పటికే సమయం గడిచిపోయింది.' అని జై షా వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలని బీసీసీఐ అప్పీలు చేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదీ జరిగింది..
Harmanpreet Kaur Vs Bangladesh : జులై 22 (శనివారం) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో అంపైర్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ అసహనంవ్యక్తం చేసింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన మూడో బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది హర్మన్ ప్రీత్. అయితే బంతి బ్యాట్‌ను తాకిందా లేదా ఆమె ప్యాడ్లను తాకిందా అనేది క్లారిటీ అవ్వలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. పైగా ఈ సిరీస్‌లో డీఆర్‌ఎస్ అందుబాటులో లేదు. దీంతో అంపైర్‌దే తుది నిర్ణయం.
Harmanpreet Kaur Umpire ఇక ఇలా జరగడం వల్ల హర్మన్ కోపంతో ఊగిపోయింది. అంపైరింగ్ సరిగ్గా చేయలేవా? అంటూ అరుస్తూ క్రీజును వీడింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అంపైర్ల తీరుపై హర్మన్ అసహనం వ్యక్తం చేసింది. అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించింది. మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చేటప్పుడు అంపైర్ల తీరుపై సిద్ధమై వస్తామంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. దీంతోపాటు ఇండియన్ హై కమిషన్ అధికారులను స్టేజ్ మీదకి పిలవకుండా వెయిట్ చేయిస్తూ బంగ్లా బోర్డు అవమానించిందని పేర్కొంది. దీంతో రెండు మ్యాచ్‌ల నుంచి బ్యాన్, మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధిస్తూ ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది.