Ganguly Health condition: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొంది. ఎలాంటి జ్వరం లేదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాత్రంతా నిద్రపోయారని, భోజనం కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిపుణులైన వైద్యులు గంగూలీని పర్యవేక్షిస్తున్నారని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
నిలకడగా గంగూలీ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల - గంగూలీ
Ganguly Health condition: కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపాయి ఆస్పత్రి వర్గాలు. నిపుణులైన వైద్యులు దాదాను పర్యవేక్షిస్తున్నరాని వెల్లడించాయి.
గంగూలీ
ఇటీవలే భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కరోనా బారినపడ్డాడు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రావడం వల్ల ఆయన సోమవారం వుడ్‌లాండ్ ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే ఆయన రెండుసార్లు కొవిడ్-19 టీకా తీసుకున్నాడు. 49 ఏళ్ల గంగూలీకి ఈ ఏడాది యాంజియోప్లాస్టీ జరిగింది.
ఇదీ చూడండి:'ఆ విషయంపై గంగూలీ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలి'