తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో కొత్త జట్లు.. ధర చూస్తే షాకవ్వాల్సిందే! - ఐపీఎల్ 2021 కొత్త ఫ్రాంచైజీలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ విస్తరణ వ్యవహారాన్ని అతి త్వరలోనే ముగించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. జులైలోనే రెండు కొత్త ఫ్రాంచైజీలను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

IPL
ఐపీఎల్

By

Published : Jun 30, 2021, 9:09 AM IST

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్‌ను 10 జట్లకు పెంచాలని ఎప్పట్నుంచో భావిస్తోంది. పైగా కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే రెండో దశ ముగియక ముందే బిడ్లు ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది.

"వచ్చే నెల టెండర్లు పిలుస్తారని తెలుస్తోంది. మేం చాన్నాళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. కొత్త ఫ్రాంచైజీ కనీస ధర 250 మిలియన్‌ డాలర్లుగా ఉంటే ఆశ్చర్యం ఏమీ లేదు" అని కొత్త జట్టు కొనుగోలుపై ఆసక్తి ప్రదర్శించిన ఓ వ్యాపార సంస్థ సీఈవో అన్నారు.

ఈ మధ్యే రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ఫ్రాంచైజీలో కొంత వాటాను ఓ సంస్థకు విక్రయించింది. దాని విలువను రూ.1855 కోట్లుగా వ్యక్తపరిచింది. అలాంటప్పుడు చెన్నై సూపర్‌కింగ్స్‌ విలువ కనీసం రూ.2200-2500 కోట్లుగా ఉండొచ్చని అంటున్నారు. భారీ స్థాయిలో ఆర్జించే కోల్‌కతా, బెంగళూరు విలువ కూడా ఎక్కువగానే ఉండొచ్చు. ముంబయి ఇండియన్స్‌ విలువ రూ.2700-2800 కోట్లు ఉంటుందని అంచనా. 2022లో మెగా వేలం జరగనుంది. అలాగే ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు ఫ్రాంచైజీల విలువ గరిష్ఠంగా 50% పెరుగుతుందని అంటున్నారు.

ఇవీ చూడండి:మైదానంలో 80 శాతం ప్రేక్షకులకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details