తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్​, కోహ్లీ టీ20 టీమ్​లో ఉంటారా.. లేదా అని తేల్చేది ఆయనే..' - bcci new chief

BCCI Officer On Virat And Rohit T20 Career : టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, టీ20 మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీల టీ20 క్రికెట్ భవితవ్యం గురించి భారత క్రికెట్​ బోర్డులోని ఓ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయనేమన్నారంటే ?

BCCI Officer On Virat And Rohit T20 Career
రోహిత్​, కోహ్లీలు టీ20లో ఉంటారా.. లేదా అని తేల్చేది ఆయనే.. : బీసీసీఐ అధికారి

By

Published : Jul 4, 2023, 4:56 PM IST

Updated : Jul 4, 2023, 6:13 PM IST

BCCI Officer On Virat And Rohit T20 Career : బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​గా పదవి నుంచి వైదొలగాక చేతన్​ శర్మ స్థానంలో వచ్చే కొత్త సెలక్టరే టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, టీ20 మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీల క్రికెట్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారని భారత క్రికెట్​ బోర్డులోని ఓ అధికారి తెలిపారు. వీరితో పాటు స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ సహా ఇతర సీనియర్​ ఆటగాళ్ల క్రికెట్​ కెరీర్​కు సంబంధించిన విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారని ఆయన ఓ ప్రముఖ స్పోర్ట్స్​ వెబ్​సైట్​కు వెల్లడించారు.

"క్రికెట్​కు సంబంధించి ఫ్యూచర్​ ప్లాన్స్​ గురించి జట్టులో ఉన్న ఆటగాళ్లతో చీఫ్​ సెలక్టర్​ చర్చించవచ్చు. అది వారి బాధ్యత కూడా. ఇందుకు ఎవరు మినాహాయింపు కాదు. ఆటగాళ్లు వయసులో పైబడినా వారి ఇష్టప్రకారం జట్టులో సుదీర్ఘ కాలం పాటు కొనసాగొచ్చు. అయితే ఎంత మంచి ఫామ్​లో ఉన్న ఆటగాళ్లైనా సరే సమయం వచ్చినప్పుడు క్రికెట్​కు గుడ్​బై చెప్పాల్సిందే."

- బీసీసీఐ అధికారి

Rohit Sharma And Virat Kohli T20 Career : ఇప్పుడు కోహ్లీ వయసు 34 ఏళ్లు, కెప్టెన్​ రోహిత్​ శర్మ వయసు 36 ఏళ్ల.. వయసు దృష్ట్యా వీరిద్దరి టీ20 ఫార్మాట్​ భవితవ్యంపై కొత్త సెలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఓ స్టార్​ ఆటగాడిగా టీమ్​లో కొనసాగుతున్నాడు.

ఆసియా కప్​ 2022లో అఫ్గానిస్థాన్​పై సెంచరీతో అద్భుతమైన ఫామ్​లోకి వచ్చిన కోహ్లీ. అదే సంవత్సరం ఆసీస్​ గడ్డపై జరిగిన టీ20 వరల్డ్​కప్​లోనూ తన దూకుడును ప్రదర్శించి సత్తా చాటాడు. తాజాగా జరిగిన ఐపీఎల్​లోనూ అదే జోరును కొనసాగించాడు. మరోవైపు కెప్టెన్​ రోహిత్​ శర్మ మాత్రం ఆశించినంత స్థాయిలో పెర్ఫార్మ్​ చేయలేకపోతున్నాడు.

BCCI New Chief Selector : బీసీసీఐ లోపల జరిగిన పలు అంతర్గత విషయాలను బహిర్గతం చేసినందున చేతన్​ శర్మ స్థానంలో కొత్త చీఫ్​ సెలక్టర్​ను నియమించేందుకు ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించారు అధికారులు. ఈ పదవి కోసం టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ అజిత్​ అగార్కర్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్​ తరఫున అసిస్టెంట్​ కోచ్​గా ఉన్న అజిత్​.. రాజీనామాను కూడా సమర్పించారు. దీంతో ఆయనకే చీఫ్​ సెలక్టర్​ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.

Last Updated : Jul 4, 2023, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details