BCCI New Chairman : బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది బీసీసీఐ. అజిత్‌ను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈయనతో పాటు శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లు కూడా సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారని క్రికెట్ బోర్డు పేర్కొంది.
BCCI Chetan Sharma : బీసీసీఐ లోపల జరిగిన పలు అంతర్గత విషయాలను బహిర్గతం చేసినందున చేతన్ శర్మ స్థానంలో కొత్త చీఫ్ సెలక్టర్‌ను నియమించేందుకు వివిధ జోన్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది బీసీసీఐ. సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ స్థానానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులను అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) వర్చువల్ విధానంలో అజిత్ అగార్కర్‌ను ఇంటర్వూ చేసింది. అనంతరం ఆయన్ను సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు కమిటీ సభ్యులు. సీఏసీ సూచన మేరకు అగార్కర్‌ను ఛైర్మన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారని బీసీసీఐ పేర్కొంది.