BCCI Net Worth : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్లో అన్ని దేశాల కంటే ధనిక బోర్డుగా కొనసాగుతోంది. ప్రస్తుతం బీసీసీఐ నెట్ వర్త్ 2.25 బిలియన్ డాలర్లు (రూ. 18,760 కోట్లు) గా ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 79 మిలియన్ డాలర్ల (రూ. 658 కోట్లు) తో రెండో స్థానంలో ఉంది. అంటే ఆసీస్ బోర్డు కంటే బీసీసీఐ దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 59 మిలియన్ డాలర్లతో ముడో స్థానంలో కొనసాగుతోంది.
బోర్డులకు ఆదాయం ఇలా..క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లు, టోర్నమెంట్ల నిర్వహణను చూసుకుంటాయి. ఇక ప్రసార హక్కులు (టెలికాస్టింగ్ రైట్స్), స్పాన్సర్షిప్ ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి డొమెస్టిక్ టోర్నీ వల్ల, బీసీసీఐకి మేజర్‌గా అత్యధిక రెవెన్యూ వస్తుంది. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో అతి సంపన్నమైన బోర్డుగా బీసీసీఐ పేరు పొందింది. అందుకే మన బోర్డు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది.
అలాగే మిగతా బోర్డులు, జట్లపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తోంది కూడా! ముఖ్యంగా ఐపీఎల్ విజయవంతం కావడం వల్ల బీసీసీఐ ఖజానా ప్రతి ఏటా భారీగా నిండుతూనే వస్తోంది. దీంతో రెవెన్యూ పరంగా మిగతా బోర్డులు.. బీసీసీఐకి కనుచూపు మేరలో కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసీసీకి భారత్ జట్టు లేకపోతే ఆదాయం లేనట్టే! అయితే ఈ ఆదాయం విషయంలో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి.. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ వల్ల మరోసారి కాసుల పంట పండినట్లు తెలుస్తోంది! అటు క్రికెట్ ఆస్ట్రేలియా (ఆసీస్ బోర్డు) కూడా బిగ్‌బాష్ లీగ్ ద్వారా ఆదాయాన్ని పొందుతుంటుంది.