టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి(team India coach Ravi Shastri), కెప్టెన్ విరాట్ కోహ్లీపై(Virat Kohli BCCI).. బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతవారం రవిశాస్త్రి, కోహ్లీ సహా పలువురు లండన్‌లో జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫలితంగా రవిశాస్త్రికి (Ravi Shastri corona) కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత రోజే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. టీమ్ఇండియా ఫిజియో నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఈ విషయంపై కోహ్లీ, శాస్త్రిల నుంచి బోర్డు వివరణ కోరినట్లు తెలుస్తోంది. బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడానికి టీమ్ సభ్యులు.. బీసీసీఐ(BCCI England tour) అనుమతి కోరలేదని తెలిసింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (England and Wales cricket board) అనుమతి కూడా లేకుండా ఈవెంట్‌కు హాజరైనట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
"ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పటికే బీసీసీఐ అధికారులకు చేరాయి. దీనిపై బోర్డు విచారణ జరుపుతుంది. ఇది బోర్డుకు మచ్చ తీసుకొచ్చింది. కోహ్లి, శాస్త్రిలను బోర్డు వివరణ కోరుతుంది. వీరంతా.. ఈవెంట్‌కు వెళ్లడంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీష్ డోంగ్రె పాత్రను కూడా బోర్డు పరిశీలిస్తోంది" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.