తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్​.. టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ అవుతారా? - rahul dravid cricket academy

దిగ్గజ క్రికెటర్ రాహుల్​ ద్రవిడ్​.. టీమ్​ఇండియా కోచ్​గా బాధ్యతలు అందుకుంటారా? ప్రస్తుతం అభిమానులకు వస్తున్న సందేహం ఇది. జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. మరోసారి ఆ పదవికి దరఖాస్తు చేస్తారా? లేదా అనేది చూడాలి.

rahul dravid
రాహుల్​ ద్రవిడ్

By

Published : Aug 10, 2021, 6:16 PM IST

జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ) (National Cricket Academy) డైరెక్టర్​ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను (రాత్రి 11.59 గంటల వరకు) చివరి తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం ఆ పదవిలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్​ ద్రవిడ్ (Rahul Dravid)​ కొనసాగుతున్నాడు.

ద్రవిడ్.. రెండేళ్ల కాలానికిగానూ 2019 జులైలో ఎన్​సీఏ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టాడు​. దీంతో పాటు భారత అండర్​-19, భారత-ఏ జట్లకు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా రిజర్వ్​ బెంచ్​ను బలంగా తయారుచేయడంలో ద్రవిడ్ సఫలమయ్యాడు. దీంతో ఈ పదవికి ద్రవిడ్ (Rahul Dravid)​ తిరిగి దరఖాస్తు చేసే అవకాశముంది.

"ద్రవిడ్​ ఎన్​సీఏ పదవికి మరోమారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​ తర్వాత టీమ్ఇండియా కోచ్​ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ద్రవిడ్​.. భారత కోచ్​గా నియామకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

"జాతీయ క్రికెట్​ అకాడమీ డైరెక్టర్​గా ఎంపికైన వ్యక్తి యువ ఆటగాళ్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆటగాళ్ల సన్నద్ధత, వారి ప్రదర్శన మెరుగుపర్చడానికి కృషి చేయాలి. భారత్-ఏ, అండర్​-23, అండర్​-19, అండర్​-16 ఆటగాళ్లు, రాష్ట్రాల అసోసియేషన్ల ప్లేయర్లకు సంబంధించి బాధ్యత ఎన్​సీఏ డైరెక్టర్​దే" అని బీసీసీఐ స్పష్టం చేసింది.

ధావన్ నేతృత్వంలోని భారత జట్టు.. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ టీమ్​కు ద్రవిడ్​ కోచ్​గా వ్యవహరించాడు. 2-1తో వన్డే సిరీస్​ను గెలుపొందిన ఆ టీమ్, 2-1తో టీ20 సిరీస్​ను కోల్పోయింది. కొవిడ్ కారణంగా పలువురు ఆటగాళ్లు చివరి మ్యాచ్​లకు దూరమయ్యారు. దీంతో టీమ్ఇండియా టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది.

రానున్న టీ20 ప్రపంచకప్​లో భారత్​ ఒకవేళ అత్యుత్తమ ప్రదర్శన చేయకపోతే రవిశాస్త్రి భారత కోచ్​ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కోచ్​ పదవీకి 60 ఏళ్ల గరిష్ఠ వయసును నిర్దేశించింది బీసీసీఐ. రవిశాస్త్రికి ప్రస్తుతం 59 ఏళ్లు. కోహ్లీ- శాస్త్రి ద్వయం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ఈవెంట్ టైటిల్​​ను కూడా గెలువలేకపోయింది. దీంతో రానున్న టీ20 ప్రపంచకప్​ గెలవడం తప్పనిసరి కానుంది. లేకపోతే కోచ్​గా కొత్త వ్యక్తిని చూసే అవకాశముంది.

ఇదీ చదవండి:గుడ్​న్యూస్​.. ఒలింపిక్స్​లో క్రికెట్​కు అంతా సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details