తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇకపై అంపైర్లకు స్పెషల్​ కేటగిరీ.. టాప్‌లో ఎవరున్నారంటే?

BCCI Umpire: అంపైరింగ్‌లో సమర్ధవంతమైన తీరు ప్రదర్శించిన వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేసింది. అందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే..

BCCI umpire
అంపైర్లకు బీసీసీఐ ప్రత్యేక విభాగం

By

Published : Jul 23, 2022, 4:49 PM IST

Updated : Jul 23, 2022, 5:38 PM IST

BCCI Umpire: అంపైరింగ్‌లో సమర్ధవంతమైన తీరు ప్రదర్శించిన వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 'ఏ', 'బి', 'సి', 'డి' కేటగిరీలు ఉండేవి. కొత్తగా 'ఏ+' విభాగం పేరుతో పదకొండు మందికి అందులో స్థానం కల్పించింది. ఇందులో అంతర్జాతీయ అంపైర్లు అనిల్ చౌదరి, మదన్‌గోపాల్ జయరామన్‌, వీరేందర్ కుమార్ శర్మ, అనంత పద్మనాభన్, నితిన్ మేనన్‌ ఉన్నారు. వారితోపాటు నిఖిల్ పట్వర్దన్, సదాశివ్‌ అయ్యర్, ఉల్హాస్ గందే, నవ్‌దీప్‌ సింగ్‌ సిధులకు స్థానం దక్కింది.

గ్రూప్‌ Aలో ఇరవై మంది, గ్రూప్‌ Bలో 60 మంది, గ్రూప్‌ Cలో 46 మంది, గ్రూప్‌ Dలో 11 మంది అంపైర్లు (వయస్సు 60-65 ఏళ్ల మధ్య ఉన్నవారు) ఉన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు తుది జాబితాకు ఆమోద ముద్ర పడింది. మాజీ అంతర్జాతీయ అంపైర్లు కే హరిహరన్, సుధీర్ అస్నాని, అమీష్ సాహెబా తదితరులతో కూడిన సబ్‌ కమిటీ నివేదిక మేరకు అపెక్స్‌ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. "ఫస్ట్‌ క్లాస్ గేమ్‌కు అంపైరింగ్‌ బాధ్యత వహించే 'A+', 'A' కేటగిరీల్లో ఉన్న అంపైర్లకు బీసీసీఐ రోజుకు రూ. 40వేలు. ఇక 'B', 'C' విభాగాల్లోని అంపైర్లకు రూ. 30వేలను బీసీసీఐ చెల్లించనుంది.

"ఇదేదో అంపైర్లను వేరు చేద్దామని కాదు. 'A+', 'A' ఎందులో ఉన్నా సరే బెనిఫిట్‌లు ఒకేలా ఉంటాయి. చివరి కేటగిరీల్లోని అంపైర్లు కూడా మంచి ప్రదర్శనే ఇస్తున్నారు. అయితే రంజీతోపాటు దేశీయ మ్యాచ్‌లకు విధులు కేటాయింపు కోసం విభాగాల వారీగా చేశాం. 2021-22 సీజన్‌లో ప్రదర్శన ఆధారంగా విభజించాం" అని బీసీసీఐ అధికారి ప్రతినిధి వెల్లడించారు. 2018 నుంచి అంపైర్ల జాబితాలోకి ఎవరినీ చేర్చలేదు. తర్వాత కసరత్తు చేసినా కరోనా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుదల పట్టడంతో వచ్చే రెండేళ్లలో దేశీయ క్రికెట్‌ పుంజుకునే అవకాశం ఉంది. దీంతో పూర్తిస్థాయిలో అంపైర్ల ఎంపికను బీసీసీఐ పూర్తి చేసింది.

ఇదీ చూడండి:'టీ20 ప్రభావం.. మరణం అంచున వన్డే క్రికెట్'​

Last Updated : Jul 23, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details