టెస్టు సిరీస్ షెడ్యూల్ లో మార్పుల కోసం టీమ్ఇండియా తమను అధికారికంగా సంప్రదించలేదని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టంచేసింది. వాయిదా పడిన ఐపీఎల్ ను పూర్తి చేయడానికి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను వారం ముందుగానే ఆరంభించాలని ఈసీబీని బీసీసీఐ కోరినట్లువార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ నుంచి అధికారింగా ఎలాంటి విజ్ఞప్తి రానందున షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లను నిర్వహిస్తామని ఈసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
బీసీసీఐ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు: ఈసీబీ
టెస్టు సిరీస్ లో మార్పుల కోసం బీసీసీఐ తమకు అధికారికంగా విజ్ఞప్తి చేయలేదని స్పష్టంచేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. దీంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లు జరుపుతామని తెలిపింది.
బీసీసీఐ అధికారిక విజ్ఞప్తి చేయలేదు: ఈసీబీ
షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 4న ప్రారంభం కావాల్సి ఉంది. దానిని వారం ముందుకు జరపడం సహా మ్యాచ్ ల మధ్య విరామాన్ని తగ్గించి ఐపీఎల్ లో మగిలిన 31 మ్యాచ్ లను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. లేదంటే రూ.2500 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో షెడ్యూల్ లో మార్పు కోసం అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ.. ఈసీబీని అధికారికంగా సంప్రదించలేదని స్పష్టంచేసింది.