పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు రూపా గురునాథ్ ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ తెలిపారు. దీనిపై బీసీసీఐ చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
టీఎన్‌సీఏ అధ్యక్షురాలికి విరుద్ధ ప్రయోజనాల సెగ - రూపా గురునాథ్‌కు విరుద్ధ ప్రయోజనాల సెగ
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు రూపా గురునాథ్‌కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఆమె రెండు పదవుల్లో కొనసాగుతున్నట్లు స్పష్టమైందని బీసీసీఐ ఎథిక్స్ తెలిపారు. దీనిపై బీసీసీఐ చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
రూపా గురునాథ్
రూపా గురునాథ్.. భారత్‌లో ఓ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలైన తొలి మహిళ. ఆమె 2019లో ఈ పదవికి ఎంపికైంది. ఆమె ఈ అధ్యక్షురాలు పదవితో పాటు ఇండియన్ సిమెంట్స్ కంపెనీకి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తోంది.