టీమ్‌ఇండియా జెర్సీ మరోసారి మారబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ.. క్రీడా పరికరాలు, దుస్తులు విక్రయించే ప్రఖ్యాత యూరోప్ బ్రాండ్ అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో త్వరలోనే భారత ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం.
కాగా 2016-2020 నైక్ సంస్థ టీమ్‌ఇండియా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత రూ.370 కోట్లతో ఎంపీఎల్ స్పోర్ట్స్ హక్కులను దక్కించుకుంది. కానీ 2023, డిసెంబర్ వరకు హక్కులు ఉన్నప్పటికీ మధ్యలోనే గుడ్ బై చెప్పేసింది. దీంతో కిల్లర్ జీన్స్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఈ సంస్థ బంగ్లాదేశ్ సిరీస్ నుంచి కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కిల్లర్ జీన్స్.. ఒప్పందం పూర్తైన తర్వాత ప్రముఖ బ్రాండ్ అడిడాస్‌తో డీల్ కుదుర్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం అందింది. ఈ డీల్ వల్ల బీసీసీఐకి కాసుల పంట కురిసే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.