ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ipl broadcasting rights) ద్వారా బీసీసీఐకి రెట్టింపు ఆదాయం రానుంది. వచ్చే ఐదేళ్ల కాలవ్వవధికి (2023-2027)కి దాదాపు రూ.36,000 కోట్లు అర్జించనుంది. లీగ్‌లోకి రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో వీటి బిడ్డింగ్ ద్వారా అధిక మొత్తమే రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం(2018-2022) ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ స్టార్ ఇండియా కలిగి ఉంది. దీని విలువ రూ.16,347 కోట్లు. కానీ రాబోయే కాలానికి ఆ విలువ కాస్త రెట్టింపు కంటే ఎక్కువగానే ఉంటుందని సంబంధిత వర్గాల సమాచారం. అదీగాక ఈసారి రెండు కొత్త టీమ్‌లో ఐపీఎల్లో వస్తున్నాయి. దీని బిడ్డింగ్ విలువ రూ.7,000 నుంచి రూ.10,000 కోట్ల వరకు పలుకనుంది. వీటి చేరికతో ఆడే మ్యాచ్‌ల సంఖ్య 74కు చేరనుంది. దీని కారణంగా బ్రాడ్‌కాస్టింగ్ విలువ కూడా పెరుగుతుందని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా ఆధారిత సంస్థ కూడా బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.