టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రిపై(ravi shastri corona) ఎలాంటి చర్యలు తీసుకోబోమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(ganguly england) స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రి ఓవల్‌లోని హోటల్లో బసచేస్తుండగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, పుస్తకావిష్కరణకు సంబంధించి బీసీసీఐ నుంచి అనుమతి పొందలేదని.. అయినా రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని గంగూలీ ఓ అంతర్జాతీయ పత్రికతో అన్నాడు.
"ఎవరైనా ఎంతసేపని హోటల్ గదిలో ఉంటారు? మీరు ఒక రోజు మొత్తం ఇంట్లో, మరోరోజు మొత్తం బయట ఉండగలరా?ఎవరైనా హోటల్ గదిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కిందకి వెళ్లకుండా ఆపలేం. అది జరగని పని. నేను తాజాగా ఒక షూటింగ్‌లో పాల్గొన్నా. అక్కడొక 100 మంది ఉన్నారు. అందరూ డబుల్ డోస్ వాక్సిన్ తీసుకున్నారు. అయినా, ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. వాక్సినేషన్ తీసుకున్నా చాలా మంది వైరస్‌బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన జీవన విధానం ఇలా ఉంది"